హైదరాబాద్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు హైదరాబాద్‌కూ వ్యాపించాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి మిలటరీ రిక్రూట్‌మెంటును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్‌లో యువకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బస్సులపై రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు.. రైల్వే స్టేషన్ వద్దనున్న బస్టాండుకు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
దీంతో ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లారు. అక్కడ ఆగిఉన్న రైళ్లపై రాళ్లు రువ్వారు. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిరసనకు దిగారు. రైలు పట్టాలకు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రయాణికులు భయంతో స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. అనుకోని ఈ ఘటనతో అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు.