ఆదోని:తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఆదోని టౌన్ లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం నాడు ఆదోని టౌన్ లో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగింది. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, పన్నుల భారం తో బతుకు భారంగా మారిందని లోకేష్ కి మహిళలు తమ బాధను చెప్పుకున్నారు.
ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుందని యువత ఆవేదన వ్యక్తం చేసింది. లోకేష్ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువత తో అన్నారు.