హైదరాబాద్ ఏప్రిల్ 16 (మిణుగురు ప్రతినిధి): ఈనెల 27న టీఆర్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ కొనసాగుతుంది. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. 27న ఉదయం 11.05 గంటలకు పార్టీ పతాకాన్ని కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సభలో దాదాపుగా 11 తీర్మానాలను ఆమోదించనున్నారు.