National News Networks

ఏపీ వ్యాప్తంగా టీచ‌ర్లు ఆందోళన బాట

Post top

విజయవాడ, ఫిబ్రవరి 8: పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా టీచ‌ర్లు ఆందోళన బాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. కొత్త పీఆర్సీ వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌ఏ కనీస శ్లాబు 12శాతానికి పైగా ఉండాలని డిమాండ్‌ చేశారు. దశలవారీ పోరాటాలకు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు.  పీఆర్సీ సాధ‌న క‌మిటీ చేతులెత్తేసినా.. ఉపాధ్యాయులు మాత్రం పీఆర్సీపై త‌గ్గేదేలేదంటూ ఉద్య‌మిస్తున్నారు. క‌మిటీ నేత‌లు త‌మ‌కు తీవ్ర అన్యాయం చేశార‌ని మండిప‌డుతున్నారు. పీఆర్సీ జీవోల వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్య సంఘాల నాయకులు చెబుతున్నారు.

‘చలో విజయవాడ’ని ఉపాధ్యాయులు దిగ్విజయం చేశారని గుర్తు చేశారు. విజయవాడ, విశాఖలో అద్దెలు అధికంగా ఉన్నాయని చెప్పారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నాయకులు భవిష్యత్‌లో ఉద్యమాలు చేస్తే తాము నమ్మే పరిస్థితి లేదని టీచ‌ర్లు తేల్చి చెబుతున్నారు. ఫిట్‌మెంట్‌ 27శాతం ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. సీపీఎస్‌ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. సోమ‌వారం నుంచి శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నారు. శుక్రవారం కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.మ‌రోవైపు, కలెక్టరేట్ల ద‌గ్గ‌ర‌ నిరసనలకు ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది ఐకాస పిలుపునివ్వ‌గా.. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల కాంట్రాక్టు ఉద్యోగ నాయకులను గృహనిర్బంధం చేశారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.