పాతపట్నం:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎంజీఆర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఐదు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా తను చేసిన సంక్షేమ కార్యక్రమాలును, ప్రజా రంజక పాలనను కొనియాడారు అదేవిధంగా రానన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుపొంది మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంజీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
