తెలంగాణ లో నోటిఫికేషన్ల జాతర మొదలైంది. ముఖ్యమంత్రి కల్వకంట్ల చంధ్ర శేఖర్ రావు ఆసేంభ్లీ లో చేసిన ప్రకటన తర్వాత తొలి నోటిఫికేషన్ వెలువడింది. 16,027 ఖాళీ పోస్టుల భర్తికి పోలిసు శాఖ రంగం సిద్దం చేసింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రత్యేక జివో విడుదలచేసింది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలు
ఎస్ఐ పోస్టుల వివరాలు
సివిల్ ఎస్ఐలు -414
ఏఆర్ ఎస్ఐలు -66
ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐలు -05
టీఎస్ఎస్‌పీ ఎస్ఐలు -23
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐలు -12
విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ -26
జైళ్ల శాఖ -08
ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐలు -22
పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ – -3
ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్ఐలు -08
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు..
సివిల్ కానిస్టేబుల్స్ -4965
ఏఆర్ కానిస్టేబుల్స్ – 4423
ఎస్ఏఆర్ సీఎల్ – 100
టీఎస్ఎస్‌పీ – 5010
స్టేట్ స్పెషల్ పోలీసు ఫోర్స్ – 390
విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ -610
జైళ్ల శాఖ(పురుషులు) – 136
జైళ్ల శాఖ(స్త్రీలు )-10
ఐటీ, కమ్యూనికేషన్ -262
పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్)-21
పోలీసు కానిస్టేబుల్ (డ్రైవర్) -100
అయితే నోటిఫికేషన్ పట్ల ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోలువుల జాతర మొదలైంది, సోదర సోదరీమణులకు ఆల్ ది బెస్ట్ అంటూ ట్విట్ చేశారు.అనంతరం యువత బి జే పి మాయలో పడోద్దని, ఉద్యోగార్ధులు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాల్క సుమన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడంలేదో చెప్పాలని ప్రశ్నించారు.
వేలాది పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌కు బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.