- వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచిన పోలీసులు
- నారాయణపై అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి
- వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు
బెయిలు లభించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నా, ఇంకా దాని అధినేతగానే ఉన్నానని పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని అన్నారు. దానితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామని, దీంతో తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేసినట్టు చెప్పారు.