National News Networks

పలుగుపట్టి మట్టితవ్విన నారా లోకేష్

Post top

కర్నూలు:ఆదోని నియోజకవర్గం పెద పెండేకల్ శివారు ఎర్రచెరువువంకలో ఉపాధి హామీ కూలీలను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం కలిశారు. కూలీల వద్ద ఉన్న గడ్డపార తీసుకొని మట్టిని తవ్వుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు.
ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తే రూ.150 కూలీ ఇస్తున్నారు.  ఎండపొద్దున నీడకోసం కనీసం పరదా పట్టలు, మంచినీళ్లు కూడా ఏర్పాటుచేయడం లేదు. పెరిగిన ధరల కారణంగా ఇప్పుడిస్తున్న కూలీ ఏ మూలకూ సరిపోవడం లేదు. పనిదినాలు, కూలీ రేట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలి. మంచినీళ్లు, నీడ సౌకర్యం కల్పించాలి.  గ్రామాల నుంచి పనిచేసే ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు..

లోకేష్ మాట్లాడుతూ  పేదలకు ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ లో రూ.261 కోట్ల ఉపాధి నిధులు దుర్వినియోగమైనట్లు కేంద్రమే చెప్పింది. ఉపాధి హామీ పథకంలో పేదల కష్టాన్ని వైసిపి నాయకులు మింగేస్తున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఉపాధి పనులు చేసే పేదల కోసం నీడ ఏర్పాటుచేయడమే గాక ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో మజ్జిగ కూడా అందించాం. ఉపాధి పనుల కోసం గడ్డపారలు ఇవ్వడమేగాక, దూరాన్ని బట్టి అదనపు కూలీ చెల్లించాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడి ఉపాధి హామీ పనిదినాలు, కూలీ పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Post Midle
Post bottom

Leave A Reply

Your email address will not be published.