పార్టీ ఇంతితై వటుడింతై అన్నట్లు ఎదిగింది.. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హరీశ్, ఇంద్రకరణ్ రెడ్డి, కవిత శుభాకాంక్షలు

- తెలంగాణ ప్రజల గుండెల నిండా గులాబీ జెండా: హరీశ్ రావు
- ప్రజల హృదయాల్లో పార్టీ సుస్థిర స్థానం సంపాదించుకుంది: ఇంద్రకరణ్ రెడ్డి
- తెలంగాణ సాధనలో ప్రధాన కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే: కవిత
టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందు అడుగు వేశారని ఆమె చెప్పారు. తెలంగాణ అంశాన్ని జాతీయ రాజకీయ ఎజెండాలో చేర్చి, రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించారని ఆమె అన్నారు. పలు పార్టీలతో జై తెలంగాణ అనిపించడానికి ప్రజా పోరాటాలను నిర్మించారని కవిత చెప్పారు. తెలంగాణ సాధనలో ప్రధాన కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే అని ఆమె చెప్పుకొచ్చారు.