ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని చెప్పగలరా?: సీఎం జగన్ కు లోకేశ్ సవాల్

- త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు
- కీలకంగా మారిన వైసీపీ మద్దతు
- స్పెషల్ స్టేటస్ సాధిస్తారని 22 మంది ఎంపీలను ఇచ్చారన్న లోకేశ్
- మెడలు వంచుతారా? అంటూ లోకేశ్ ట్వీట్
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారని వెల్లడించారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తారని ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారని తెలిపారు.
Related Posts
“ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడిందే నిజమైతే… ప్రత్యేక హోదా ప్రకటిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటన చేయగలరా?” అని లోకేశ్ సవాల్ విసిరారు. మెడలు వంచుతారా? లేక కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి గారూ?” అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.