ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టుకు ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి పురీషనాళంలో భారీగా హెరాయిన్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు నిర్ధారించారు. ఎయిర్‌పోర్టులో దిగిన ఆమె అనుమానాస్పదంగా కనిపించడంతో.. అదుపులోకి తీసుకున్నారు.
ఉగాండా నుంచి షార్జా మీదుగా ఢిల్లీ వచ్చిన ఆ ప్రయాణికురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె పురీషనాళంలో హెరాయిన్‌ను దాచి ఉంచినట్లు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 6 కోట్ల విలువ చేసే 894 గ్రాముల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ యాక్ట్ కింద పోలీసులు ఆ ప్రయాణికురాలిని అరెస్టు చేశారు.