ఇవాళ తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి యాదాద్రి గుట్టపైనున్న క్యూ కాంప్లెక్స్ లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి శ్రీలక్ష్మీ నృసింహుడి ఆలయ పరిసర ప్రాంతాల్లోనూ వరద నీరు చేరింది.
వరద నీరు గుట్టపై నుంచి కిందకు జాలువారడంతో కిందనున్న కాలనీలు జలమయమయ్యాయి. గుట్ట నుంచి కిందకు వెళ్లే మార్గంలో వేసిన నూతన రహదారి కుంగిపోయింది. గుట్ట బస్టాండ్ ప్రాంగణం మొత్తం వరద నీటిలో మునిగింది.