National News Networks

రెండో రోజూ… శోభాయమానంగా సహస్రాబ్ది వేడుకలు

Post top
  • పోలీసుల అదుపులోకి సమతామూర్తి ఆశ్రమం
  • సందర్శించిన సీఎం కేసీఆర్‌

రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 :రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ ‌శ్రీరామనగరంలో సమతా మూర్తి ఆశ్రమంలో కొనసాగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి యాగశాలలో ప్రారంభమైన యాగాలు మధ్యాహ్నానికి ముగిశాయి. మొదటి రోజు కంటే ఈ రోజు భక్తులు కూడా అత్యధికంగా వచ్చారు. ప్రముఖుల రాక కూడా అలాగే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ‌శ్రమాన్ని సందర్శించి చినజీయర్‌ ‌స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతుల కల్పన గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

వాటిని మరింత మెరుగుపరిచేందుకు అధికారులకు తగు సూచనలు చేశారు. నగరి ఎమ్మెల్యే రోజా యాగానికి హాజరై చినజీయర్‌ ‌స్వామి ఆశీస్సులు అందుకుంది. ఆశ్రమంలో జరుగుతున్న విభజన బృందాల సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఆశ్రమం పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఏడు వేల మంది పోలీసులతో పాటు మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఆశ్రమానికి చేస్తున్నందున హెలిప్యాడ్‌ ‌వద్ద ట్రాయల్స్ ‌నిర్వహించారు. జెడ్‌ ‌కేటగిరి కి సంబంధించిన బలగాలను రప్పించారు. రెండోరోజు భక్తుల రాకడ పెరగడంతో వాహనాలను కంట్రోల్‌ ‌చేయడానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష దొరుకుతూ ఎలాంటి అవాంతరాలు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మౌలిక వసతుల కల్పనకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం నిరంతరం పనిచేస్తుంది.

కూలిన గోడ తప్పిన పెను ప్రమాదం………
అవసరమా యాగశాల వద్ద ఏర్పాటుచేసిన టాయిలెట్స్ ‌వద్ద చేతులు కడుక్కునేందుకు నల్లాతో ఏర్పాటుచేసిన గోడ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే తేరుకున్న సిబ్బంది దానిని పునర్నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.