న్యూఢిల్లీ: ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం చిజర్సి టోల్ గేట్ దగ్గర జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో అయన భద్రతపై సమీక్ష చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.
24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సీఆర్పిఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారు. వీరిలో కమెండోలు కుడా వుంటారు. పోలీసులతో సహా 22మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. అయన కారులో ప్రయాణించే సమయంలో ఒక పైలట్ కారు ఎస్కార్టు కారు వుంటుంది. అయితే, తాను ఎప్పుడూ భద్రతను కోరుకోలేదని, తన ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఒవైసీ వ్యాఖ్యానించారు.