విజయనగరం:విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్ లో రిజర్వేషన్ కౌంటర్ వద్ద 4 బ్యాగులతో గంజయి కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి, తన వద్ద నుండి 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితుడి రిమాండుకు తరలించినట్లుగా విజయనగరం 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటరు.వద్ద ఉదయం 7 గంటల సమయంలో ఒక వ్యక్తి 4 బ్యాగులతో అనుమానస్పందగా ఉన్నారని రాబడిన సమాచారంమేరకు విజయనగరం 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు ఆదేశాలతో ఎస్ఐలు భాస్కరరావు, అశోక్ కుమార్ మరియు వారిసిబ్బంది రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటరు వద్ద అనుమానాస్పందంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద ఉన్ననాలుగు బ్యాగులు తనిఖీ చేయగా, వారి బ్యాగుల్లో 66 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
అతనిని ప్రశ్నించగా తనపేరు మౌలాబాక్స్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అని తెలిపాడు. నిందితుడి వద్ద నుండి 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని,రిమాండుకు తరలించినట్లుగా 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు ముద్దాయిలు ఉన్నారనివారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని సిఐ బి.వెంకటరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో 1వ పట్టణ ఎస్ఐలు భాస్కరరావు, వి. అశోక్ కుమార్, మురళీ మరియు ఇతర పోలీసు అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.
