National News Networks

ఆపదొస్తే అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహిస్తుంది: ‘ఆచార్య’ ట్రైలర్ రిలీజ్

Post top
  • ‘ఆచార్య ‘గా చిరంజీవి
  • ‘సిద్ధ’ పాత్రలో చరణ్ 
  • కథానాయికలుగా కాజల్, పూజ హెగ్డే  
  • ఈ నెల 29వ తేదీన విడుదల
చిరంజీవి –  చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ‘ఆచార్య’  సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి చరణ్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. గతంలో చిరంజీవికి అనేక మ్యూజికల్ హిట్స్ ను ఇచ్చిన మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. 
ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ధర్మస్థలి చుట్టూ ఈ కథ నడుస్తుందనే విషయం ట్రైలర్ వలన తెలుస్తోంది. యాక్షన్ కీ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ .. ప్రధానమైన పాత్రలను కలుపుతూ కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతోంది.

చిరంజీవి  సరసన కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది. సిద్ధ పాత్రలో చరణ్ కనిపించనుండగా, సోనూ సూద్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. చిరూ – చరణ్ నక్సలైట్స్ గా కనిపించనున్న ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి

Post Midle
Post bottom

Leave A Reply

Your email address will not be published.