ముగిసిన సీపిఎం అఖిల భారత మహాసభలు
17 మందితో పోలిట్ బ్యూరో ఎంపిక.
పోలిట్ బ్యూరో సభ్యుడిగా తిరిగి ఎన్నికైన రాఘవులు.
తెలంగాణ నుండి తమ్మినేని ,సీతారాములు,నాగయ్యలు
ఎపి నుంచి వి.శ్రీనివాస రావు, ఎం.ఏ గపూర్ లు సి సి కి ఎంపిక..
తెలంగాణ నుంచి ఎస్. వీరయ్య, ఎపి నుంచి పి.మధు రీలివ్ ..
కేంద్ర కమీటి కోటా లో బి.వెంకట్, ఆరుణ్ కుమార్,హేమలత లు కేరళ లోని కన్నూర్ లో ఏప్రిల్ 6 వ తేదీ నుంచి జరుగుతున్న సీపీఐ(ఎం) 23వ పార్టీ మహాసభలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి తో పాటు భారీగా కేంద్ర కమీటిని సైతం ఎంపిక చేసింది నాయకత్వంఆదివారం నాడు కొత్త కేంద్ర కమిటీని వివిధ రాష్ట్రాల నుండి హాజరైనటువంటి ప్రతినిధులు కేంద్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో పార్టీ బలహీనపడటంతో ప్రాతినిధ్యం తగ్గింది. సీపీఎం కేంద్రకమిటీ లోకి తెలంగాణ నుండి తమ్మినేని వీరభద్రం, జి.నాగయ్య, చెరుపల్లి సీతారాములు, ఆంధ్ర కమిటి నుండి వి. శ్రీనివాసరావు, గఫూర్ లు ఎంపికయ్యారు. తెలంగాణ నుండి గతంలో కేంద్ర కమిటీలో వున్న వీరయ్య ను, ఆంధ్ర నుండి వున్న మధును తగ్గించారు.
కాగా 85 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటు అయ్యింది. ఇందులో 17 మంది కొత్త సభ్యులు కాగా.. 15 మహిళలకు చోటు లభించింది. ఇక కేంద్ర కమిటిలో తెలుగు వాళ్ళు బీవీ రాఘవలు, పుణ్యవతి, హేమలత, అరుణ్ కుమార్, బి. వెంకట్ లు అఖిల భారత కేంద్రం కోటాలో ఎంపికయ్యారు.
పోలిట్ బ్యూరోకి ఎంపికైన సభ్యులు సీతారాం ఏచూరి( ప్రధాన కార్యదర్శి)
ప్రకాశ్ కారత్, పినరయ్ విజయన్, కోడియార్ బాలకృష్ణన్, బృందా కారాత్, మాణిక్ సర్కార్, ఎండి సలీం, సూర్యాకాంత మిశ్రా, బి.వి రాఘవులు, తపన్ సేన్, నిలోత్పల్ బసు, ఎం.ఏ బేబి, జి.రామకృష్ణన్, సుభాషీణి అలీ,రామచంద్రా డోమో ఆశోక్ ధావాలే, ఏ. విజయరాఘవన్.