National News Networks

అమెజాన్ లో తొలగింపులు పదివేలు కాదు 20 వేలట!

Post top

సాఫ్ట్ వేర్ రంగంలో దిగ్గజ కంపెనీలు ఇటీవల వరుసబెట్టి ఉద్యోగాల కోత విధించడం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి.. ట్విట్టర్ తో మొదలైన ఈ తొలగింపుల్లో అమెజాన్ కంపెనీలోనే అత్యధికంగా ఉన్నాయి. అమెజాన్ పది వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుందని గత నెలలో ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీలేదని సంస్థ వివరణ ఇచ్చింది. పెద్దగా లాభదాయకం కాని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వేరే విభాగాల్లోకి మార్చుతున్నట్లు తెలిపింది.

కంపెనీ ఉద్యోగులు మాత్రం మరోలా చెప్పారు. వాలంటరీగా రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ కంపెనీ అడుగుతోందని పలువురు సోషల్ మీడియాలో ఆరోపించారు. కాగా, తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికతో పాటు గంటలలెక్కన పనిచేసే సిబ్బందిని కూడా కలుపుకుంటే అమెజాన్ లో సుమారు 15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తమ ప్లాంట్లు, వేర్ హౌస్ లు, కంపెనీ ఔట్ లెట్లలో పనిచేస్తున్న సుమారు 10 వేల మంది ఉద్యోగులను అమెజాన్ ఇంటికి పంపించేసిందని వార్తలు వెలువడ్డాయి. అమెజాన్ కంపెనీలో తొలగింపులు పది వేల మందితో ఆగిపోవని, రాబోయే రోజుల్లో మరింత మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపిస్తుందని తాజాగా బయటపడ్డ రిపోర్టుల్లో వెల్లడైంది. కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్లతో సహా చిన్నా పెద్ద ఉద్యోగులు మొత్తం 20 వేల మందిని తొలగించాలన్నదే అమెజాన్ ఆలోచన అని తేలింది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.