National News Networks

25 మందితో ఏపీ కొత్త మంత్రివర్గ జాబితా ఇదిగో…

Post top
  • పూర్తయిన మంత్రివర్గ కూర్పు
  • కొత్త మంత్రుల జాబితాకు సీఎం జగన్ ఆమోదం
  • పలువురు సీనియర్ మంత్రులకు మళ్లీ చోటు
  • రోజా, అంబటి రాంబాబులకు మంత్రి పదవులు
ఏపీలో కొత్త క్యాబినెట్ రూపుదిద్దుకుంది. 25 మందితో సీఎం జగన్ నూతన మంత్రివర్గ జాబితాను ఖరారు చేశారు. ఇందులో పలువురు సీనియర్ మంత్రులకు మళ్లీ అవకాశమిచ్చారు. 
బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు, అంజాద్ బాషా, నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తానేటి వనిత, ఆదిమూలపు సురేశ్ కొత్త మంత్రివర్గంలోనూ స్థానం సంపాదించుకున్నా, వారికి ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇంకా తెలియరాలేదు. కాగా, కొత్తగా మంత్రివర్గంలో చోటు సంపాదించినవారిలో రోజా, అంబటి రాంబాబు, జోగి రమేశ్ తదితరులు ఉన్నారు.

కాగా, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్, కన్నబాబు తమ మంత్రిపదవులను నిలుపుకోలేకపోయారు. వారికి తాజా మంత్రివర్గంలో స్థానం లభించలేదు.

నూతన మంత్రివర్గంలో ఉన్నది వీరే!

1. బొత్స సత్యనారాయణ 

2. సీదిరి అప్పలరాజు
3. ధర్మాన ప్రసాదరావు
4. పీడిక రాజన్నదొర
5. గుడివాడ అమర్నాథ్
6. బూడి ముత్యాలనాయుడు
7. దాడిశెట్టి రాజా
8. పినిపే విశ్వరూప్
9. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
10. తానేటి వనిత
11. కారుమూరి నాగేశ్వరరావు
12. కొట్టు సత్యనారాయణ
13. జోగి రమేశ్
14. అంబటి రాంబాబు
15. మేరుగ నాగార్జున
16. కాకాణి గోవర్ధన్ రెడ్డి
17. అంజాద్ బాషా
18. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
19. గుమ్మనూరు జయరాం
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
21. నారాయణస్వామి
22. రోజా
23. ఉషశ్రీ చరణ్
24. ఆదిమూలపు సురేశ్
25. విడదల రజని

Post bottom

Leave A Reply

Your email address will not be published.