బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిశారు ఏపీ నూతన బీజేపీ చీఫ్ పురందేశ్వరి. రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం పట్ల నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై నేతలు చర్చించారు. భవిషత్తులో పార్టీ తరపున చేపట్టబోయే కార్యక్రమాలు తదితర అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన బాధ్యత, నిబద్దత గురించి నడ్డాకు వివరించినట్లు పురందేశ్వరి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఏపీలో బీజేపీని బోలపేతం చేయడంతోపాటు ఆంధ్రుల ప్రయోజనాలు కాపాండేందుకు కృషి చేస్తానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.