- భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద రైతుదీక్ష
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద రైతుదీక్ష నిర్వహిస్తున్నది.
కేంద్ర విదేశాంగ మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు & బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి శాసనసభా పక్ష నాయకులు రాజా సింగ్, బిజెపి రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, బిజెపి నాయకులు పాల్గొంటారు. కనీస మద్దతు ధర(1960)కు కొనుగోలు చేయనందున రైతులు వరి ధాన్యం తక్కువ ధరకు 1400 లకు అమ్ముకుంటున్నారు. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.
వెంటనే కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలి. కెసిఆర్ ప్రభుత్వం వడ్లు కొను లేదా గద్దె దిగు నినాదంతో రైతు దీక్ష ను బిజెపి నిర్వహిస్తున్నది.
బిజేపి పోటీదీక్ష