విజయవాడ:విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి వ్యవహారంలో పెద్దల పంచాయతీ వికటించిండంతో ఘటన జరిగింది. విజయవాడ చెందిన నవీన్, ఒంగోలుకు చెందిన యువతీ ప్రేమించుకున్నారు. ఈ నేపధ్యంలో ఖుద్దుస్ నగర్ లో ఇరువురి కుటుంబాలు పంచాయతీ జరుపుకున్నాయి.
ఆ సమయంలో మాటా మాట పెరిగి పెళ్ళికొడుకు అన్న జగదీష్ చేతిలో యువతి మేనమామ వరసైన శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగదీష్ పాత నేరస్తుడుగా పోలీసులు గుర్తించారు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
