National News Networks

మాస్ మహారాజా రవితేజ ఖ‌లాడి నుండి క్యాచ్ మీ పాట విడుద‌ల‌

Post top

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు మరియు హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ రోజు ఐదో పాట‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. క్యాచ్ మీ అంటూ సాగే ఈ పాటను ర‌వితేజ – డింపుల్ హయాతిల మీద చిత్రీక‌రించారు. ఈ పాటలో డింపుల్ లుక్స్‌, కిల్ల‌ర్ ప‌ర్స‌నాలిటి, క‌ట్టిప‌డేసే ఎక్స్‌ప్రెష‌న్స్ ప్రేక్ష‌కుల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ పాటతో గ్లామర్ విందు ఇచ్చింది డింపుల్‌. దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకోసం మ‌రో మాస్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. శ్రీ మ‌ణి సాహిత్యం, నేహా బాషిన్, జ‌స్ప్రీత్ జాస్జ్ గానం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రీలీజ్ చేసిన అన్ని పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా రవితేజ సరసన నటించారు. సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఖిలాడీ ఫిబ్రవరి 11న తెలుగు మరియు హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకురానుంది.

Post Midle
Post bottom

Leave A Reply

Your email address will not be published.