ముస్లింలు పవిత్ర మాసంగా ఆచరించే రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందును ఈ నెల 12 వ తేదీ సాయంత్రం ఎల్ బి స్టేడియంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత ఏర్పాట్లు చూడాల్సిందిగా తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని, సిఎం ఆదేశించారు.