ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తల్లి మీనాక్షి సింగ్ (85) కొద్దిసేపటి క్రితం మరణించారు. మీనాక్షి సింగ్ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతపాన్ని వ్యక్తం చేశారు. మీనాక్షి సింగ్ ఆత్మకు శాంతి కలగాలని సోమేష్ కుమార్ తో పొన్ లో మాట్లాడి తన సానుభూతిని తెలియజేశారు.
మంత్రులు కొప్పుల ఈశ్వర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు, ఐ ఏ ఎస్ అధికారులు తమ సంతాపాన్ని, విచారాన్ని వ్యక్త పరిచారు.