- నిన్న కేబినెట్ భేటీలో ఆమె ప్రస్తావన
- గవర్నర్ అత్యుత్సాహం చూపిస్తున్నారన్న సీఎం
- ఆమెది వితండవాదమంటూ మంత్రులతో వ్యాఖ్య
కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసైకి మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు సీఎం సహా ప్రభుత్వం దూరంగా ఉండడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ లేకుండానే ప్రారంభించడం, యాదాద్రికి వెళ్లినా ప్రొటోకాల్ పాటించకపోవడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సర్కారు తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద సర్కారు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.
అసలు గవర్నర్, సర్కార్ మధ్య దూరం పెరగడానికి కారణం కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును గవర్నర్ నిరాకరించడమేనన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఢిల్లీ పర్యటనలోనూ గవర్నర్ తమిళిసై వెల్లడించారు కూడా. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రులతో గవర్నర్ తీరుపై సీఎం కేసీఆర్ మాట్లాడినట్టు చెబుతున్నారు.