National News Networks

కొరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి

Post top
  • ప్రత్యక్ష బోధనతో పాటు ఆన్‌లైన్‌ ‌తరగతులకు అనుమతించాలి
  • ప్రభుత్వానికి సూచించిన రాష్ట్ర హైకోర్టు

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ ‌బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ ‌బోధన కూడా కొనసాగించాలని సూచించింది. హైదరాబాద్‌లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కోవిడ్‌ ‌నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాల్సిందేనని అన్నారు. సమ్మక్క జాతరలో కొరోనా నియంత్రణ చర్యలు అమలు చేయండి. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కోవిడ్‌ ‌నిబంధనలు అమలయ్యేలా చూడాలని కూడా హైకోర్టు సూచించింది. నిర్లక్ష్యం వల్ల కొరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతని హైకోర్టు వ్యాఖ్యానించింది.

రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కొరోనా తగ్గుముఖం పడుతుందని పాజిటివిటీ రేటు 3.40శాతం ఉందని తెలిపారు. జీహెచ్‌ఎం‌సీలో 4.64 శాతం, మేడ్చల్‌లో 3.76 శాతం పాజిటివిటీ రేటు ఉందని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొరోనా పాజిటివిటీ రేటు తగ్గింది. అత్యల్పంగా గద్వాలలో 1.45శాతం పాజిటివిటీ రేటు ఉంది. 99 లక్షల ఇళ్లల్లో ఫీవర్‌ ‌సర్వే చేశారు. కోవిడ్‌ ‌లక్షణాలు ఉన్న 4.32 లక్షల మందికి మెడికల్‌ ‌కిట్లు అందించాం. పిల్లల చికిత్సకు హాస్పిటళ్లలో తగిన ఏర్పాట్లు చేశాం. రోజుకు లక్షకు పైగా కొరోనా పరీక్షలు జరుగుతున్నాయి.

మేడారం జాతరలో కోవిడ్‌ ‌నిబంధనల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిమని, కొరోనా పరీక్షలు, వైద్య శిబిరాలు, అంబులెన్సులు సిద్ధం చేశామని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతోనే పాఠశాలలు తెరిచినట్లు విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. విద్యాసంస్థల్లో కోవిడ్‌ ‌నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నట్లు నివేదికలో డీహెచ్‌ శ్రీ‌నివాసరావు తెలిపారు. రెండు వారాల్లో కొరోనా ప్రబల కుండా తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది. కొరోనా పరిస్థితులపై విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.