- గొల్లపూడి నుంచి మైలవరం వరకు ప్రయాణం
- ఉగాది పండుగ వేళ విద్యుత్ ఛార్జీలను పెంచారని విమర్శ
- గుడ్ ఫ్రైడేకి ఆర్టీసీ టికెట్ ధరలు పెంచారని వ్యంగ్యం
టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అమరావతిలోని గొల్లపూడి నుంచి మైలవరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రజలతో మాట్లాడి వారి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ పాలనపై బస్సులోని ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Related Posts
ఉగాది పండుగ వేళ విద్యుత్ ఛార్జీలను మరింత పెంచారని. గుడ్ ఫ్రైడేకి ఆర్టీసీ టికెట్ ధరలు పెంచారని ఈ సందర్భంగా దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ మోసపూరిత సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు.