- ప్రధాన పాత్రలు పోషించిన రాధిక, సాయికుమార్
- ఎమోషన్స్, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్
- భారీ క్వాలిటీతో వస్తున్న ‘గాలివాన’
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత థియేటర్లు మళ్లీ నిండిపోతున్నాయి. ఇదే సమయంలో ఓటీటీలు కూడా దూసుకుపోతున్నాయి. ఇంటిల్లిపాది హాయిగా ఇళ్లలో కూర్చొని ఓటీటీలో సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమాలతో పాటు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేలా వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. వీటిలో జీ5 సంస్థ తనదైన ముద్రను వేస్తూ ముందుకు కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందించిన జీ5… తాజాగా ‘గాలివాన’ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది.
Related Posts
ఈ వెబ్ సిరీస్ లో రాధిక, సాయికుమార్ లతో పాటు చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేశ్ తదితరులు నటించారు. కుటుంబ అనుబంధాలకు సంబంధించిన ఎమోషన్స్ తో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ వెబ్ సిరీస్ భారీగా కనిపిస్తోంది. మదర్ సెంటిమెంట్ తో పాటు, క్రైమ్ థిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్ ను బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించారు.