National News Networks

ఆదివాసి సమాజానికి..విశ్వ కోయ గోండి బాషా దినోత్సవ శుభాకాంక్షలు : కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు)

Post top

కోయ బాషా దినోత్సవ శుభాకాంక్షలు  తెలియజేసెన 

కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) 

విశ్వ కోయ — గోండి భాష దినోత్సవ సందర్భంగా…

ప్రపంచీకరణలో భాగంగా మొదలైన భాష, సాంస్కృతిక విధ్వంసం ఆదివాసీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. దీనితో పలు భాషలు అంతరించిపోతున్నాయి. వీటిలో కోయ (గోండీ) భాష కూడా ఒకటి. భారత దేశంలో ఆస్ట్రెక్ , ద్రవిడియన్, సినో టిబెటన్ ఇండో యూరోపియన్ నాలుగు భాషా కుటుంబాలు కాగా రెండవ కుటుంబమైన ద్రవిడియన్ విభాగములో కోయ భాష చెందుతుంది.
 యవ్వ (తల్లి) గర్భం నుంచి పుట్టిన లిపి లేని కోయ భాషను బ్రతికించుకోవడానికి చిన్న ప్రయత్నం జరుగుతున్నది. కోయ భాషను మాట్లాడే రాష్ట్రాలు అంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిషా, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కాగా మాండలికాల్లో కొద్దిపాటి తేడా ఉంటుంది. 

 

 కోయ తెగను గోండ్, దొర్ల, మురియా , కుయిగా పిలుస్తారు. నెయ్,ఎడ్జ్ ,కల్క్, కెల్క్ , ఏర్ మొదలగు పదాలు ఒకే విధంగా ఉచ్చరిస్తారు, ఈ భాషను నాలుగు కోట్ల మంది మాట్లాడుతారు. 
☆☆ భాష పరిరక్షణ ఎందుకు..?
భాష అంటే కేవలం భావ ప్రకటనా మాద్యమమే కాదు. మనిషి అస్తిత్వపు జాడ. సంస్కృతి, ఆత్మగౌరవ ప్రతీక. అంతరంగాన్ని ఆవిష్కరించే ఒక సాధనం. మనోభావాలు, హక్కులు రక్షించే వారసత్వ సంపద. అది నిత్యం పారే జీవనది లాంటిది. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీకి ఇది మరింత అపురూపమైనది. దీనిని పదిల పరచి భావి తరాలకు అందించవలసిన బాధ్యత అందరిపైనా ఉంది.

 

కోయ నిఘంటువు.
☆————-☆
లిపిలేని కోయ భాషకు వివిధ రాష్ట్రాల అధికారిక భాషలను కలిపి నిఘంటువును తయారు చేసే ప్రక్రియ ప్రారంభమయింది. దీని కోసం మొదటి వర్క్ షాప్ గాంధీ స్మృతి దర్శన్ కల్చరల్  మినిస్టర్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో 2014 జులై 21 నుంచి 25వరకూ, రెండవ వర్క్ షాప్ ఆగస్టు 24 నుండి 29 వరకు కన్నడ యూనివర్సిటీ సహకారంతో హంపిలోనూ,మూడో వర్క్ షాప్ 25 నుండి 29 వరకు 2014 లో మధ్యప్రదేశ్లో అమర్ కంటక్ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించడం జరిగింది. 

నాలుగవ వర్క్ షాప్ డిసెంబర్ 10 నుంచి 15 వరకు 2014 ఉట్నూర్ గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ సహకారంతోనూ, ఐదవ వర్క్ షాప్ మార్చ్ 12 నుంచి 16 వరకు 2015 భద్రాచలం గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ సహాయంతోనూ, ఆరవ వర్క్ షాప్ నవంబర్ 21 నుంచి 25 వరకు 2015 చంద్రపూర్ ఆదివాసి శిక్షణ సంస్థ సహాయంతోనూ, ఏడవ వర్క్ షాప్ జనవరి 9 నుంచి 14 వరకు కన్నడ యూనివర్సిటీ సహకారంతోనూ, ఎనిమిదవ వర్క్ షాప్ ఆగస్టు ఢిల్లీలో 2017 లో జరిగింది. భారత రాజ్యాంగం లోని ఎనిమిదో షెడ్యూల్ ప్రకారంగా కోయ (గొండి) భాష కు గుర్తింపు కోసం 2017, జులై 21 న కోర్ కమిటీ కోయ భాష దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిందని జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి కన్వీనర్ కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు)

ఈ సందర్భంగా ఆదివాసి సమాజానికి  శుభాకాంక్షలు తెలిపారు .
Post bottom

Leave A Reply

Your email address will not be published.