*తెలంగాణ*
_*జల దోపిడీలో వైయస్ పాత్ర లేదు.. జగన్ హస్తం మాత్రం ఉంది – రేవంత్ రెడ్డి*_
*కృష్ణా జలాల దోపిడీకి కేసీఆరే కారణం*
★ రాయలసీమ ఎత్తిపోతల పథకం వెనుక కేసీఆర్ సూచనలు ఉన్నాయి
★ ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే వారిని బహిష్కరించాలి
★ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
★ ఇరు రాష్ట్ర ప్రభుత్వ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
_*ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ…*_
★ కృష్ణా జలాల దోపిడీకి కేసీఆరే కారణమని అన్నారు.
★ నీళ్ల అంశాన్ని కేసీఆర్ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు.
★ తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కలిపినా తమ రాష్ట్రానికి కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే వాడుకోగలమని… కానీ, రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.
★ రాయలసీమ ఎత్తిపోతల పథకం వెనుక కేసీఆర్ సూచనలు ఉన్నాయని రేవంత్ దుయ్యబట్టారు.
★ కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ పథకానికి రూపకల్పన జరిగిందని అన్నారు.
★ కృష్ణా జలాల దోపిడీలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్ర లేదని… కానీ, ఇప్పుడు జగన్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు.
★ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను షర్మిల పార్టీ వైపు నడిపించేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు.
★ ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే వారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని అన్నారు.
★ నదీ జలాల విషయంలో లేనిపోని వివాదాలను సృష్టించి రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు.