National News Networks

రాష్ర్టానికి శనిలా సీ3 ఎంపీలు: జీవన్‌రెడ్డి

Post top
  • బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి
  • సింహం లాంటి కేటీఆర్‌ను అంటే పుట్టగతులుండవ్‌
  • ఎంపీ అర్వింద్‌ 24 గంటల్లో ముక్కునేలకు రాయాలి
  • ఆశన్నగారి జీవన్‌రెడ్డి డిమాండ్‌

హైదరాబాద్‌: బండి సంజయ్‌, అర్వింద్‌, రేవంత్‌రెడ్డి.. ఈ ముగ్గురూ సీ3 (చిల్లర, చిచోరా, చీప్‌ క్వాలిటీ) ఎంపీలని పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వీరు రాష్ర్టాన్ని శనిలా పట్టుకొన్నారని మండిపడ్డారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తొండి మాటల బండి సంజయ్‌, అరగుండు అరవింద్‌, ఆంబోతు రేవంత్‌రెడ్డిలూ చదువూ సంధ్యాలేని నై మాలూమ్‌ (ఏమీ తెలియని) ఎంపీలుగా అభివర్ణించారు. ఏడున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3,65,797 కోట్లు చెల్లిస్తే, కేంద్రం రాష్ర్టానికి తిరిగి చెల్లించింది కేవలం రూ.1,68,647 కోట్లు మాత్రమేనని చెప్పారు. ఇదే విషయాన్ని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తాను చెప్పేది తప్పు అని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరితే, బీజేపీ నేతలు దాన్ని స్వీకరించకుండా పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్‌, అర్వింద్‌ హెయిర్‌లెస్‌, హెడ్‌ లెస్‌ ఎంపీలుగా మారారని ఎద్దేవాచేశారు.

ఏది అడిగినా తమకేం తెలియదనే అజ్ఞానుల్లా.. నై మాలూమ్‌ ఎంపీలుగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియని అజ్ఞానపు నేతలు వీరని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీలు కేడీ నంబర్‌ వన్‌లుగా మారితే, రేవంత్‌ జైలు కెళ్లి బేడీ నంబర్‌ వన్‌గా మారారని విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురు నేతలు ఢిల్లీకి బానిసలై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకొంటున్నారని విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ సింహం.. అర్వింద్‌, రేవంత్‌ పిచ్చికుక్కల్లా మొరుగుతున్నారని ధ్వజమెత్తారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. వీళ్లు పెట్టుకోవద్దని హితవు పలికారు.

కేటీఆర్‌ అభివృద్ధికి అంబాసిడర్‌
కేటీఆర్‌ అభివృద్ధికి అంబాసిడర్‌ అయితే బండి సంజయ్‌, అర్వింద్‌, రేవంత్‌రెడ్డి కేటుగాళ్లకు అంబాసిడర్లుగా అవతారం ఎత్తారని దుయ్యబట్టారు. బండి తిరుగుబోతు, అర్వింద్‌ వాగుబోతు అని, రేవంత్‌ తన ఇంటి పేరును అనుములకు బదులు ఆంబోతుగా మార్చుకోవాలని అన్నారు. అర్వింద్‌ను సన్‌ ఆఫ్‌ కరప్షన్‌గా వ్యాఖ్యానించారు. అర్వింద్‌ అసలైన హిందువుకాదని, ఓట్ల కోసం డ్రామాలాడే రాజకీయ రాబందువు అని మండిపడ్డారు. లక్షల మంది భక్తుల ఆరాధ్య దైవం ఎల్లమ్మతల్లిని అవమానించిన నీచుడు అర్వింద్‌ అని.. కుద్వాన్‌పూర్‌ ఎల్లమ్మ గుడి ముందు 24 గంటల్లోగా ముకు నేలకు రాయాలని డిమాండ్‌చేశారు. రేవంత్‌ చంద్రబాబుకు చప్రాసి అని, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బూట్లు నాకి.. పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితలపై నోరు జారితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఖర్చు మేమే భరిస్తాం
బండి సంజయ్‌, అర్వింద్‌ ఇద్దరూ మాటి మాటికి కేటీఆర్‌ వెంట్రుకలు కావాలని అడుగుతున్నారని, బొచ్చు లేని వారు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకుంటారా? అని ప్రశ్నించారు. అంతగా కావాలంటే వారి హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేలా తాను ఏర్పాటు చేస్తానని ఆయన ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ బండికి రేవంత్‌రెడ్డి పెట్రోలు పోయించానని ప్రగల్భాలు పలకటం దుర్మార్గమన్నారు. కేటీఆర్‌ను చాలెంజ్‌ చేసే రేంజ్‌ రేవంత్‌రెడ్డికి లేదన్నా రు. బీజేపీ పేదలపై బుల్డోజర్లు ప్రయోగిస్తే తాము రాజకీయ బుల్డోజర్‌ ప్రయోగించి బీజేపీని అం తం చేస్తామని స్పష్టంచేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో కరెంటు కోతలుంటే రాష్ట్రంలో ప్రతి పక్షాల పిచ్చికూతలున్నాయని దుయ్యబట్టారు. కేసీఆర్‌ది అభివృద్ధి గానమని, కాంగ్రెస్‌, బీజేపీలది అసహన గానమని విమర్శించారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.