నిమ్స్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దానం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిమ్స్ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ఇతర వైద్యుల పర్యవేక్షణలో ఆంకాలజీ బ్లాక్ లో ని క్యాన్సర్ రోగులకు పండ్లను అందజేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిమ్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు.
గతంలో నిమ్స్కు రావాలంటే దుర్వాసనతో బాధపడే వాళ్ళని అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.