- ధాన్యం కొనుగోలు, డ్రగ్స్ అంశాలపై అర్వింద్ స్పందన
- కేసీఆర్ ప్రతి గింజా కొంటామని చెప్పారని వెల్లడి
- ధాన్యం కొనకుండా ధర్నాలు హాస్యాస్పదమని వ్యాఖ్యలు
- డ్రగ్స్ దందాకు కేటీఆరే కెప్టెన్ అని విమర్శలు
కేటీఆర్ పై పరువునష్టం దావా వేయాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కోరుతున్నా అని అర్వింద్ తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ పదవుల్లో ఉన్నంతకాలం హైదరాబాద్ ‘ఉడ్తా హైదరాబాద్’ గా ఉంటుందని వ్యాఖ్యానించారు. గతంలో పంజాబ్ లో డ్రగ్స్ తీవ్రతపై ‘ఉడ్తా పంజాబ్’ అనే చిత్రం రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, అర్వింద్ ఉడ్తా హైదరాబాద్ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.