National News Networks

ఐటీలో తెలంగాణ స‌త్తాపై కేటీఆర్ ట్వీట్‌!

Post top
  • 8 ఏళ్ల‌లో ఎగుమ‌తుల్లో 3 రెట్ల‌కు మించి వృద్ధి
  • గ‌తేడాదిలో ఎగుమ‌తుల్లో 26.14 శాతం వృద్ది న‌మోదు
  • ఉపాధి రంగంలో 23.48 శాతం న‌మోదైంద‌న్న కేటీఆర్‌
ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐటీ) రంగంలో తెలంగాణ స‌త్తా చాటుతోంది. ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాటి నుంచి చూసుకుంటే… ఈ రంగంలో తెలంగాణ ఏటికేడు వృద్ధినే న‌మోదు చేస్తూ సాగుతోంది. ఏ ఒక్క ఏడాదిలోనూ ఈ రంగంలో తెలంగాణ తిరోగ‌మ‌న దిశ‌లో సాగ‌లేదు. ఈ మేర‌కు 2014 నుంచి ఈ ఏడాది వ‌ర‌కు ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన వృద్ధిని కోట్ చేస్తూ తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
2014 నుంచి ఏడేళ్ల ప్ర‌గ‌తి ఒక ఎత్తైతే…గ‌డ‌చిన ఏడాదిలో ఈ రంగంలో తెలంగాణ ఉత్తమ ప్ర‌గ‌తిని సాధించింద‌ని కేటీఆర్ తెలిపారు. గ‌తేడాదిలో ఐటీ ఎగుమ‌తుల్లో 26.14 శాతం వృద్ధిని న‌మోదు చేసిన తెలంగాణ‌… ఉపాధిలో 23.48 శాతం వృద్ధిని న‌మోదు చేసింద‌ని ఆయ‌న తెలిపారు. ఎగుమ‌తుల్లో గ‌డ‌చిన 8 ఏళ్ల‌లో ఏకంగా మూడు రెట్ల‌కు మించి వృద్ధి న‌మోదైంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గ‌ణాంకాలు తెలుపుతున్న ఓ డ‌యాగ్ర‌మ్‌ను కూడా కేటీఆర్ త‌న ట్వీట్‌కు యాడ్ చేశారు.
Post bottom

Leave A Reply

Your email address will not be published.