- వరంగల్ జిల్లా టూర్‌లో కేటీఆర్
- మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్‌లో కేటీఆర్ బహిరంగ సభ
- అంతకు గంట ముందే బహిరంగ సభ టెంట్లు కూలిన వైనం
- వరంగల్‌లో రేగిన గాలి దుమారమే కారణం
వరంగల్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం నాడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ బహిరంగ సభకు కేటీఆర్ వెళ్లేందుకు ఇంకో గంట సమయం ఉండగానే.. బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.
Related Posts
వరంగల్‌లో బుధవారం మధ్యాహ్నం గాలి దుమారం రేగింది. ఈ ప్రభావంతో కేటీఆర్ బహిరంగ సభ టెంట్లు కూలిపోయాయి. అయితే కేటీఆర్ సభకు హాజరు కాకముందే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదమే తప్పింది.