ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి కన్నుమూత
ముంబై ఫిబ్రవరి 16: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి కన్నుమూశారు. 69 ఏండ్ల బప్పి లహిరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ముంబైలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఒంటినిండా బంగారంతో ప్రత్యేకంగా కనిపించే బప్పి.. 1980, 90వ దశకాల్లో తన డిస్కో మ్యూజిక్‌తో భారతీయ సినీపరిశ్రమను ఒక ఊపుఊపేశారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చల్తే చల్తే, డిస్కో డ్యాన్సర్, షరాబీ వంటి పలుచిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి.