మిలాన్ నావికా విన్యాసాలు ప్రారంభం
విశాఖపట్నం: విశాఖ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మిలాన్-2022 పేరుతో అంతర్జాతీయ నావికా విన్యాసాలకు విశాఖ వేదిక కానుంది. 1971లో పాకిస్తాన్లోని కరాచీ పోర్టుపై దాడి చేసి విజయపతాకం ఎగరేసిన గుర్తుగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో స్టార్ట్ అయ్యి 25 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కరోనా ప్రభావంతో గత కొన్నేళ్లుగా నేవీ విన్యాసాలకు దూరమైన విశాఖ ప్రజలకు ఫ్లీట్ రివ్యూ అదిరిపోయే ఆతిద్యం ఇవ్వనుంది.అందుకు తగ్గట్టుగా జరుగుతున్న ఏర్పాట్లుతో ఇప్పటికే సాగర తీరం సరికొత్త శోభను సంతరించుకుంది.ఫ్లీట్ రివ్యూ సందర్బంగా నేవీ సిబ్బంది రిహార్సల్స్ తో అదరగొట్టారు.విశాఖ సాగరతీరం యుద్ధ భూమిని తలపించేలా విన్యాసాలు చేసి అబ్బురపరిచారు.
యుద్ధ సమయంలో శత్రువులను పరుగులు పెటించే తీరును నేవిక దళ సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూపించారు. సముద్రంలో శత్రువులపై బాంబులు వేయడం,వాటిని ధీటుగా ఎదుర్కోవడం లాంటి విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు. యుద్ధనౌక నుంచి జెమినీ బోట్లపై తీరానికి చేరడం, శత్రు స్థావరాలపై కాల్పులు జరపడం వంటిని నేవీ సిబ్బంది ప్రాక్టీసు చేశారు.రిహార్సల్స్ రూపంలో ముందిగా ప్రజలకు కళ్ళ ముందు నిలిచాయి.ఆకాశంలో పారా గ్లైడర్లు చక్కర్లు, సురక్షితంగా తీరంలో దిగడం వంటివి నిర్వ హించారు. యుద్ధనౌకలపై వుండే హెలికాప్టర్లు నీలాకాశంలో దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకర్షించాయి.జెమినీ బోట్లలో దూసు కొచ్చిన నౌకాదళం విన్యాసాలు సందర్శకులను కట్టుకున్నాయి.కళ్లు చెదిరే విన్యాసాలతో కదన రంగాన్ని తలపించే వాతావరణంతో ఆర్కే బీచ్ దద్దరిల్లింది.ఈ రిహార్సల్స్ ను చూసేందుకు భారీగా ప్రజలు తరలిరావడంతో సందడిగా మారింది.