రాంగ్ రూట్ లో మంత్రి కాన్వాయ్
యాదాద్రి భువనగిరి: భువనగిరి శివారులో హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి రాంగ్ రూట్ లో ప్రయాణించారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్ళితున్న మంత్రి బోనగిరి శివార్లలోని ఓ ప్రవేట్ హోటల్ కి వెళ్లారు. అయితే ఆ హోటల్ కు చేరుకోవడానికి రాంగ్ రైట్ లో వెళ్ళారు.
మంత్రి కాన్వాయ్ వస్తున్న నేపథ్యంలో వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలను పోలీసులు హోటల్ వద్ద నిలిపివేశారు. రాంగ్ రూట్ లో వెళ్తున్న మంత్రి కాన్వాయ్ కోసం తమ వాహనాలను నిలిపివేయడంపై ప్రజల అసహనం వ్యక్తం చేశారు.