సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపూరి రాజలింగం, స్థానిక ప్రజాప్రతినిధుల ఆయా కార్యక్రమాలను ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రూ.3కోట్లతో వెజ్, నాన్ వెజ్, రైతు బజార్ దుకాణ సముదాయాన్ని నిర్మించన్నుట్లు పేర్కొన్నారు. రూ.కోటితో పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టల్ ప్రారంభించామని, రూ.కోటి రూపాయలతో మార్కెట్ యార్డు దుకాణం నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
దసరా లోపు ఇంటిగ్రేటెడ్ కార్యాలయం ప్రారంభం అయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మార్కెట్ యార్డ్ నిర్మాణానికి రూ.4కోట్లు కేటాయించామన్నారు. చేర్యాలలోని మున్సిపాలిటీలో 12వార్డులకు రూ.12కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.6కోట్లతో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఆసుప్రతిలో నలుగురు వైద్యులతో అదనంగా సేవలందిస్తామన్నారు. ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి ఏఎన్‌ఎం సెంటర్‌కు చేర్యాల, చుట్టుపక్కల పరిధిలోని 30 భవనాలకు రూ.6కోట్లు మంజూరు చేశారు. జనగామ నియోజకవర్గ పరిధిలో 3వేల రెండు పడకల గదుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు.
ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలం ఉంటే రూ.3లక్షలు మంజూరు చేస్తామన్నారు. చేర్యాల పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచిందని, వచ్చే నెల రోజుల్లో 57 ఏళ్లు ఉన్న వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, దళితులకు దళితబంధు ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రెండువారాల్లో 14 సార్లు కేంద్ర ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజానీకానికి సహాయం చేస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతున్నది.