ఐటి దాడులు బిజెపి ప్రేరేపితమే
ఎన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షమే
ప్రతిపక్షాలను దాడులతో అణిచివేత అప్రజాస్వామికం
బి ఆర్ ఎస్ నేతలది తెరిచిన పుస్తకమే
పార్టీలోకి రాకముందే వారికి వ్యాపారాలున్నాయి
వారి వారి వ్యాపారలన్నీ వైట్ పేపర్లే
లెక్క ప్రకారమే పన్నులు చెల్లిస్తున్నారు.
విచారణా సంస్థలడ్డుపెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.
దాడులకు బి ఆర్ యస్ నేతలు తొణకరు: మంత్రి జగదీష్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: ఐటి దాడులు బిజెపి ప్రభుత్వ ప్రేరేపితమే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ఈ మేరకు అయన సూర్యాపేటలో బుధవారం మీడియాతో మాట్లాడారుఎన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షమే నన్నారు.దాడులతో ప్రతిపక్షాలను అణిచివేయ్యాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నారు.బి ఆర్ ఎస్ నేతలది తెరిచిన పుస్తకమన్నారు.పార్టీలోకి రాక ముందే వారికి వ్యాపారాలు ఉన్నాయన్నారు.వారి వారి వ్యాపారాలన్నీ వైట్ పేపర్లే నన్నారు.లెక్క ప్రకారమే పన్నులు చెల్లిస్తున్నారని ఆయన చెప్పారు. విచారణ సంస్థలను అడ్డు పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.