National News Networks

తెలంగాణ ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కే. తారకరామారావు

Post top

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు… అనేకమంది ఆశ్చర్యంగా చూసారు • అయినా ఈరోజు దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది • గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేసినా, ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించగలిగాము • హైదరాబాద్ ఐటి రంగానికి ఎంతగానో ఊతం ఇస్తుందనుకున్న ఐటిఐఆర్ ప్రాజెక్టుని కేంద్రం రద్దు చేసినా, ఈ ప్రగతి సాధ్యం అయ్యేలా చూడగలిగాము • దీంతోపాటు దాదాపు రెండు సంవత్సరాల పాటు కరోనా సంక్షోభం ఆ తర్వాత మారిన పరిస్థితులను కూడా దాటుకొని ఈ అభివృద్ధి సాధ్యమైంది • గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ ఐటి రంగ వృద్ధిలో అన్ని సూచీల్లో… జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతున్నది • హైదరాబాద్ నగరాన్ని ఐటి మరియు ఐటి అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగాము

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమ ముఖచిత్రం కీలక గణాంకాలు

31.44% వార్షిక వృద్ధితో 2,41,275 కోట్ల ఐటీ ఎగుమతులు • గత సంవత్సరపు 1,83,569 కోట్ల ఎగుమతులతో పోలిస్తే 57,706 కోట్ల పెరుగుదల • 16.2% వార్షిక వృద్ధితో 9,05,715 ఐటి ఉద్యోగాలు • గత సంవత్సరం వచ్చిన నూతన ఐటీ ఉద్యోగాలు 1,26,894 • భారతదేశంలో వస్తున్న ప్రతి రెండు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం తెలంగాణ నుంచి వస్తుంది • 2014వ సంవత్సరం తెలంగాణ ఐటి ఎగుమతులు 57,258 కోట్ల మాత్రమే ఉంటే ఈరోజు ఇవి దాదాపు 4 రేట్లు పైగా పెరిగి 2,41,275 కోట్లకు పెరిగింది • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో 17.31 శాతం CAGR తో పెరిగింది • తెలంగాణ ఏర్పాటు నాటికి 2014లో 3,23,396 ఉద్యోగాలు ఉంటే అవి ఈరోజు మూడు రెట్లు పెరిగి 9,05,715 కు పెరిగాయి • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా ఐటీ రంగంలో నేరుగా 5,82,319 ఉద్యోగాలు వచ్చాయి. • వీటికి మూడు రెట్లు పరోక్ష ఉద్యోగాలు వచ్చాయి • గత సంవత్సరం దేశ సగటు ఐటి ఎగుమతులు 9.36 శాతం ఉంటే తెలంగాణ మాత్రం అత్యంత అద్భుతంగా 31.44 శాతంతో పెరిగాయి • 2014లో మొత్తం దేశ ఐటీ ఉద్యోగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83% గా ఉంటే నేడు కొత్త ఉద్యోగాల కల్పనలో ఒక్క తెలంగాణ 27.6% గా ఉంది • దేశంలో కొత్త ఐటి ఉద్యోగాలు కల్పనలో గత సంవత్సరం 33% ఉద్యోగాలు తెలంగాణ నుంచి ఏర్పాటు అయితే అవి ఈ సంవత్సరం 44 శాతానికి పెరిగాయి.

గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కీలక ఐటీ మరియు ఐటీ అనుబంధ పెట్టుబడులు

Fisker – తన ఇండియా హెడ్ క్వార్టర్స్ ని హైదరాబాదులో ఏర్పాటును ప్రకటించింది Callaway golf company – 20,000 చదరపు అడుగులలో 200కు పైగా ఉద్యోగులతో కార్యాలయాన్ని ప్రారంభించింది • క్వాల్కమ్ అమెరికా తర్వాత తన అతిపెద్ద క్యాంపస్ ని హైదరాబాదులో ఏర్పాటు చేసింది. దాదాపు 3904 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. 1.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు పదివేల మంది ఉద్యోగులతో కార్యాలయాన్ని ప్రారంభించింది • గూగుల్ అమెరికా అవతల తన అతిపెద్ద కార్యాలయాన్ని 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేసింది • స్విస్ రే కంపెనీ హైదరాబాదులో తన ఇన్నోవేషన్ మరియు అనలిటికల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది • ZF మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తన అతిపెద్ద సాఫ్ట్వేర్ హాబ్ ను హైదరాబాద్లో 5000 మంది ఇంజనీర్లతో ఏర్పాటు • ఎక్స్పేరియన్ సర్వీసెస్ హైదరాబాద్లో కార్యకలాపాలు ప్రారంభించింది. మూడు సంవత్సరాలు 4000మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనుంది • LTI మైండ్ ట్రీ సంస్థ హైదరాబాద్లో డిజిటల్ ఎక్స్పీరియన్ సెంటర్ ఏర్పాటు• తెలంగాణ పోలీస్ శాఖ సైబర్ క్రైమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ • Bosch గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏర్పాటు 3000 మందికి పైగా ఉద్యోగుల నియామకం • మైక్రోసాఫ్ట్ మూడు కొత్త డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది.

తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అతి పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే • అమెజాన్ వెబ్ సర్వీసెస్ మూడు డేటా సెంటర్ లను దాదాపు 36 వేల 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు • సైబర్ ఆర్క్ కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ • లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయనుంది. 1000 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వనున్నది • Dazn ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ని వెయ్యి మంది ఉద్యోగులతో ప్రకటించింది వచ్చే సంవత్సరం మరో 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది • వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ 1200 మందితో డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నది • జ్యాప్ కామ్ గ్రూప్ 1000 మందికి పైగా ఉద్యోగులతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు • Technipfmc గ్లోబల్ సాఫ్ట్వేర్ డెలివరీ సెంటర్, ప్రొసీషన్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు 2500 మందికి ఉద్యోగాలు • అల్లియాంట్ గ్రూప్ విస్తరణ..మ 9000 మందికి ఉద్యోగాలు • VXI గ్లోబల్ సొల్యూషన్స్ తన కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని హైదరాబాదులో ఏర్పాటు చేయనుంది 10000 మందికి ఉద్యోగాలు • Mondee హోల్డింగ్స్ సంస్థ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు 200 మందికి పైగా ఉద్యోగాలు • రైట్ సాఫ్ట్వేర్ తన నూతన డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 500 మందికి పైగా ఉద్యోగాలు • స్టేట్ స్ట్రీట్ తన అతి పెద్ద క్యాంపస్ ని హైదరాబాదులో ఏర్పాటు చేసింది అయిదు వేల మందికి పైగా ఉద్యోగాలు.

ద్వితీయ శ్రేణి పట్టణంలో ఐటి

వరంగల్లో టెక్ మహేంద్ర, సైయంట్, జేన్పాక్ట్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి • LTI మైండ్ ట్రీ, జెంపాక్ట్,HRH నెక్స్ట్, hexand solutions సంస్థలు ఈ సంవత్సరం హనుమకొండ కు వచ్చాయి • మహబూబ్నగర్ ఐటి టవర్ ని మే ఆరవ తేదీన ప్రారంభించడం జరిగింది • దీంతోపాటు తాజా అమెరికా పర్యటనలు పలు కంపెనీలతో నిజామాబాద్ సిద్దిపేట నల్గొండలో ఐటీ ఉద్యోగాల కల్పనకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. తద్వారా 2500 ప్రత్యక్ష ఐటి ఉద్యోగాలతో పాటు పదివేల పరోక్ష ఉపాధి అవకాశాలు

ఎలక్ట్రానిక్స్ రంగంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు

ఎలక్ట్రానిక్స్ రంగంలో 38వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించింది 31 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు 9500 కోట్లతో అమరరాజా లిటియం అయాన్ తయారీ కేంద్రం దివిటిపల్లిలో పెట్టుబడి 4500 ప్రత్యక్ష ఉద్యోగాలు 500 మిలియన్ డాలర్లతో ఫాక్స్ కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం కొంగరకలాన్ లో ఏర్పాటు. లక్ష మందికి ఉద్యోగాలు ఈ ప్రిక్స్, ev వీక్ నిర్వహణ చేయడం జరిగింది. ఫార్ములా ఈ రేసు హైదరాబాదులో నిర్వహించడం జరిగింది టీ హబ్ 2 ను ప్రారంభించుకోవడం జరిగింది… ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం ఇది. రెండు వేల స్టార్ట్ అప్స్ ఇందులో పని చేసేందుకు అవకాశం. 5,82,000 చదరపు అడుగుల విస్తీర్ణం. దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రం టీ వర్క్స్ ప్రారంభం…

Post bottom

Leave A Reply

Your email address will not be published.