జగిత్యాల:పురపాలక,ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బుధవారం
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ది పనులు, డబల్ బెడ్ రూం ,ప్రాజెక్ట్ నిర్మాణం దాదాపు చివరి దశలో ఉన్నందున ప్రాజెక్ట్ కోసం తాగునీటి సౌకర్యం,
కరెంట్ సదుపాయం కల్పించాలని కోరగా స్పందించిన మంత్రి రోడ్డు భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కి, సంబంధిత అధికారులకు నిధుల మంజూరు చేయాలని కోరారు..ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.వెంట మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్ ,జగిత్యాల రూరల్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు.