70,041 మంది విద్యార్థుల దరఖాస్తు:నెక్కొండ
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఆదివారం రాతపరీక్ష జరగనుంది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు సిహెచ్
రమణకుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల
వరకు ఆరో తరగతి, అదేరోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏడు నుంచి పదో తరగతి వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈనెల ఆరో
తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించామని వివరించారు. 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. ఆరో తరగతి ప్రవేశాల కోసం 40,137 మంది,
ఏడో తరగతి కోసం 12,545 మంది, ఎనిమిదో తరగతి కోసం 9,998 మంది, తొమ్మిదో తరగతి కోసం 5,676 మంది, పదో తరగతి కోసం 1,685 మంది దరఖాస్తు చేశారని వివరించారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ మాస్క్ ధరించాలని, కోవిడ్ నిబంధనలతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ముఖ్య సూచనలు
ప్రవేశ పరీక్ష ఏప్రిల్ ఆదివారం2023 రోజున నిర్వహించబడును. 6 వ తరగతి వారికి ఉదయం 10 నుండి 12 గంటల వరకు,
7 నుండి 10 వ తరగతి వరకు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు
నిర్వహించబడును.ప్రతి విద్యార్థి తన వెంబడి హాల్ టికెట్ తెచ్చుకోవాలి ఉదయం సెషన్కు హాజరయ్యే విద్యార్థి ఉదయం 9 గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం సెషన్కు హాజరయ్యే విద్యార్థి 1గంట వరకు
పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలి పరీక్ష రెండు గంటల పాటు జరుగుతుంది మధ్యలో పంపించబడురు
పరీక్ష ఓఎంఆర్ షీట్ పద్ధతిలో జరుగుతుంది ఓఎంఆర్ లో బ్లూ లేదా బ్లాక్ పెన్ తో బబ్లింగ్ చేయాలి ప్రతి విద్యార్థి
తన వెంబడి రెండు బాల్ పాయింట్ పెన్నులు, మాస్క్, ఎగ్జామ్ ప్యాడ్ తెచ్చుకోవాలి మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, స్మార్ట్ వాచెస్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధించబడినవి పరీక్ష పూర్తయిన వెంటనే
ఓఎంఆర్ షీట్ ఇన్విజిలేటర్ కు అందజేయాలి హాల్ టికెట్ పైన ఫోటో లేని విద్యార్థులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొచ్చుకోవాలి హాల్ టికెట్ లో తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెల్లి ఓఎంఆర్
లో ఏటువంటి కొట్టివేతలు, దీద్దుడు, వైటెన్నేర్ వాడటం చేయరాదు అని నెక్కొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రణయ్ కుమార్ తెలిపారు.