National News Networks

బడ్జెట్ పెట్టిన నుంచి కేసీఆర్‌కి పూనకం వస్తోంది: ఎంపీ అర్వింద్

Post top

న్యూఢిల్లీ ఫిబ్రవరి 10: బడ్జెట్ పెట్టిన నుంచి కేసీఆర్‌కి పూనకం వస్తోందని బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శించారు. బీజేపీ దూకుడికి కేసీఆర్‌కి టెన్షన్ పట్టుకుందని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ మాటల్లో తప్పు లేదని, వాడిన పదంలో కూడా తప్పు ఏం లేదన్నారు. ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ అని, కేసీఆర్ హామీలు పక్కన పెట్టి సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ దేశమంతా కొట్టుకొని పోతుందని, ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే ప్రయత్నం చేస్తున్నారని అర్వింద్ వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ తెలంగాణ ఇస్తే టి.ఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో మెర్జ్ చేస్తామన్నారు. రాజకీయ కారణాల తో 1200 వందల మంది యువకులు మృతి చెందారు.

డిసెంబర్ 2009 తెలంగాణ ప్రకటన చేసి మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గారు. కేసీఆర్ నీబొంద సెంటిమెంట్ తెలంగాణ. వెనకబడిన 9 జిల్లాలకు ప్రతి ఏడాది 450 కోట్లు వచ్చాయి. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి 2,420 కోట్లు కేంద్రం కేటాయించింది. కేసీఆర్ తెలంగాణ‌ను ముంచేశాడు. బిచ్చగాళ్ల పరిస్థితికి తీసుకొచ్చారు. కేంద్రం నిధులు ఇస్తోంది, ప్రొజెక్టులు పూర్తి చేస్తుంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు,ఇప్పటి వరకు స్థలం కూడా కేటాయించలేదు. ట్రైబల్ యూనివర్సిటీకి నలభై కోట్లు కేటాయించారు. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి ఏమైంది.ఇవ్వన్నీ ఇచ్చేలోగా కేసీఆర్, కేటీఆర్ సావు కూడా అవుతోంది.

కాళేశ్వరానికి సంబంధించి డి.పి.ఆర్‌లు ఎందుకు ఇవ్వడంలేదు. మమత బెనర్జీ 25 లక్షలు ఇల్లు కట్టింది. నువ్వు కనీసం కేంద్రం డబ్బులు తీసుకోలేదు. ఇచ్చిన డబ్బులకు లెక్క లేదు. కాంగ్రెస్‌కి నా నియోజకవర్గంలో 5 శాతం ఓట్లు లేవు. రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. సోనియాగాంధీ దిష్టి బొమ్మదగ్ధం చేయండి. వాజపేయి 3 రాష్ట్రాలను విభజన చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పదేళ్ళు ప్రభుత్వం అనుభవించి లాస్ట్‌లో తెలంగాణ ఇచ్చారు.’’ అని అర్వింద్ అన్నారు.
Tags: MP Arvind, dharmapuri mp, cm kcr, central budget

Post bottom

Leave A Reply

Your email address will not be published.