న్యూఢిల్లీ:మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపి వై ఎస్ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా మృతుడి కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. గురువారం నాడు సిజెఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్ ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. శుక్రవారం విచారణకు స్వీకరిస్తామని సిజెఐ డివై చంద్రచూడ్ చెప్పారు.
వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును అవినాశ్ రెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు నిచ్చింది. 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్నిసునీత సుప్రీంలో సవాలు చేసారుర.
