అతని నిజాయితీ కి పలువురు ప్రశంసలు
కోరుట్ల:ఓ మున్సిపల్ కార్మికుడికి దొరికిన సెల్ ఫోన్ ను సెల్ ఫోన్ యజమానికి అప్పగించి నిజాయితీని చాటుకుని పలువురి ప్రశంసలు అందుకున్నాడు… వివరాలకు వెళ్తే మెట్ పల్లి పట్టణ మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు మున్సిపల్ లో చెత్త సేకరణ వాహన డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న లంక శ్రీకాంత్ గోల్ హనుమాన్ దేవాలయం ఏరియాలో రోజువారి వీధుల్లో భాగంగా గురువారం ఉదయం విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆరపేటకు చెందిన సన్వాజ్ అనే వ్యక్తి ఆ దారిలో 18 వేల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఆ సెల్ ఫోన్ మున్సిపల్ కార్మికుడు శ్రీకాంత్ కు దొరకగా ఫోన్ పోయిన వ్యక్తి వెతుకుతుండగా గమనించి కౌన్సిలర్ చర్లపల్లి లక్ష్మి రాజేశ్వర్ గౌడ్ సమక్షంలో ఫోన్ పోయిన వ్యక్తికి అందజేశాడు. మున్సిపల్ కార్మికుని నిజాయితీ కి స్థానిక కౌన్సిలర్ తో పాటు కాలనీ వాసులు అతని పై ప్రశంసలు కురిపించారు.