- కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్ కు అధికారుల ఘన స్వాగతం
- పోలీసుల గౌరవవందనం స్వీకరించిన సీఎం
- కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించి పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి
నాగర్‌కర్నూల్ సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న సీఎంకు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాంబర్‌లో కలెక్టర్ ఉదయ్ కుమార్‌ను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.