National News Networks

ఎమ్మెల్యే తండ్రి ద‌శ‌దిన క‌ర్మ‌కు హాజ‌రైన కేసీఆర్‌… అక్క‌డే స‌హ‌పంక్తి భోజ‌నం

Post top
  • ఇటీవ‌లే మృతి చెందిన లింగ‌య్య తండ్రి న‌ర‌సింహ‌
  • గురువారం నార్క‌ట్‌ప‌ల్లిలో ద‌శ దిన క‌ర్మ‌
  • స్వ‌యంగా హాజ‌రై లింగ‌య్య‌ను ఓదార్చిన కేసీఆర్‌
  • కేసీఆర్ వెంట టీఆర్ఎస్ కీల‌క నేత‌లంతా హాజ‌రు
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు త‌న పార్టీకి చెందిన కీల‌క నేత‌, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య తండ్రి ద‌శ దిన క‌ర్మ‌కు హాజ‌ర‌య్యారు. లింగ‌య్య తండ్రి నర‌సింహ ఇటీవ‌లే మృతి చెంద‌గా…లింగ‌య్య సొంతూరు నార్క‌ట్‌ప‌ల్లిలో గురువారం నాడు ద‌శ దిన క‌ర్మ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స్వయంగా హాజ‌రైన కేసీఆర్‌…. కార్య‌క్ర‌మంలో భాగంగా అక్క‌డే ఏర్పాటు చేసిన సహ‌పంక్తి భోజ‌నంలో పాల్గొన్నారు.
తండ్రిని కోల్పోయిన బాధ‌లో ఉన్న చిరుమ‌ర్తి లింగ‌య్య‌ను ఓదార్చిన కేసీఆర్‌… లింగ‌య్య కుటుంబ సభ్యుల‌కు ధైర్యం చెప్పారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ప్రజలను సీఎం పలకరించారు. అనంతరం ఎమ్మెల్యే నివాసం లో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్,ఎర్రబెల్లి దయకర్ రావు,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి; ఎమ్మెల్సీలు పల్లా రాజేశర్వ రెడ్డి, గోరెటి వెంకన్న, కోటిరెడ్డి, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ; ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, భాస్కరరావు, భగత్, పైళ్ళ శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్; ఎంపీలు రంజిత్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్; టిఆర్ఎస్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.