శ్రీకాకుళం:మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురజాడ విద్యాసంస్థల గాయత్రి కళాశాల ఎన్సిసి క్యాడెట్లు మునసబు పేట గ్రామంలో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు మత్తు పదార్థాలకు బానిస కావద్దంటూ, అక్రమ రవాణాను అరికట్టాలంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్య పరిచారు. అలాగే ర్యాలీ అనంతరం మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలుకు వినియోగించమని, అక్రమ రవాణాను అడ్డుకుంటామని ప్రజలకు మాదకద్రవ్యాల పట్ల అవగాహన కలిపించి వాటి బారిన పడకుండా కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ఎన్సిసి అధికారి కెప్టెన్ వంగా మహేష్ మాదక ద్రవ్యాల నిరోధక చట్టాలు, మాదకద్రవ్యాల బారిన పడితే జీవితం ఏ విధంగా నాశనం అవుతుందని తెలిపి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పని చేయాలని క్యాడిట్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్యాడెట్లకు గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామి నాయుడు సంచాలకులు సంయుక్త కరస్పాండెంట్ అంబటి రంగారావు ప్రిన్సిపాల్ డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు, అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు.